ఆర్టీసీ తనిఖీ అధికారిని పరెగెత్తించి కొట్టిన కండక్టర్... ఎందుకో తెలుసా?

ఠాగూర్
శనివారం, 2 మే 2026 (11:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ టికెట్ తనిఖీ అధికారి (టీటీఈ)పై కండక్టర్ చెప్పుతో దాడి చేశాడు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ తనిఖీ అధికారి పరుగుపెట్టాడు. అయినప్పటికీ వదిలిపెట్టని కండక్టర్.. తనిఖీ అధికారిని పలుమార్లు చెప్పుతో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వెళుతున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఝరాసంగం మండలం కప్పాడ్ వద్ద ఆర్టీసీ అధికారులు ఏసయ్య, ప్రకాశ్‌లు బస్సును ఆపి అందులోని ప్రయాణికుల వద్ద టిక్కెట్లు తనిఖీ చేశారు. కండక్టర్ వసంత్ ఓ ప్రయాణికుడి వద్ద రూ.20 తీసుకుని మహిళల ఉచిత ప్రయాణం కోసం ఇచ్చే జీరో టికెట్‌ను ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో కండక్టర్‌కు టీటీఐ ప్రకాశ్ చార్జి మెమో జారీ చేశారు.
 
ఈ క్రమంలో టిక్కెట్ తనిఖీ అధికారులు తనను రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ కండక్టర్ ప్రయాణికులను రెచ్చగొట్టాడు. కొందరు ప్రయాణికులతో కలిసి టీటీఐ ప్రకాశ్‌పై చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అధికారులు వద్ద ఉన్న దస్త్రాలను చింపివేశారు. దీంతో ప్రకాశ్ రాయకోడ్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై నారాయణఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కండక్టర్ వసంత్ గత ఫిబ్రవరి 12వ తేదీన సస్పెండ్ అయ్యాడని, ప్రజాపాలన కార్యక్రమలో అదికారులు అతన్ని క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇంతలోనే ఈ ఘటన జరిగిందని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments