నిన్నటికి నిన్న చిరుత పులి.. నేడు నాగర్ కర్నూలులో కొండచిలువ

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (08:58 IST)
python
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని రవి థియేటర్ సమీపంలోని పాత సరుకుల గోదాము ముందు కొండచిలువ ఉన్నట్లు స్థానిక కాలనీ వాసులు గుర్తించారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున కొండచిలువ కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి కొండచిలువను పట్టుకుని అడవిలోకి వదలాలని స్థానికులు కోరుతున్నారు.
 
మరోవైపు నిన్నటికి నిన్న నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానిక రైతులను భయపెడుతుంది.  తాజాగా రాములు అనే రైతులు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిలన క్రమంలో చిరుత పులి కనిపించింది. 
 
తన సెల్‌ఫోన్‌లో చిరుతను వీడియో తీసి గ్రామస్తులకు చేరవేశాడు. నల్లమల చిరుతలు ఆహార వేటలో భాగంగా పొలాలు, గ్రామాల వైపు వస్తున్నాయని దీంతో తమతో పాటు పశు సంతతికి ప్రాణహానీ నెలకొందని వారు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో "చెన్నై లవ్ స్టోరీ" ఒకటి కాబోతోంది - హీరో కిరణ్ అబ్బవరం

Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు

ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

తర్వాతి కథనం
Show comments