Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన

సెల్వి
శనివారం, 24 ఫిబ్రవరి 2024 (19:49 IST)
తెలంగాణలోని 15 స్టేషన్లు, 50 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలతో కలిపి 550 అమృత్ భారత్ స్టేషన్‌ల నిర్మాణానికి ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వే శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రైల్వే లైన్లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో డబ్లింగ్, ట్రిపుల్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీంతో పాటు రైల్వే క్రాస్‌ల వద్ద రద్దీని నివారించేందుకు రైల్వే ఫ్లై ఓవర్లు, రైలు అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు. 
 
రైళ్లు, రైల్వే లైన్లను విస్తరించడమే కాకుండా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
 
అందులో భాగంగా, భారతీయ రైల్వేలు "అమృత్ భారత్ స్టేషన్లు" అనే కొత్త పథకాన్ని ప్రారంభించాయి.
 
 రెండు వేలకు పైగా రైల్వే స్టేషన్లలో ప్రసారమయ్యే వర్చువల్ ఈవెంట్‌లో వివిధ రాష్ట్రాలలో దాదాపు 1,500 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments