Publish Date: Thu, 22 Feb 2024 (22:50 IST)
Updated Date: Thu, 22 Feb 2024 (22:53 IST)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే భానుడి భగభగల నుంచి తప్పించుకునే రీతిలో... ఈ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆపై పొడి వాతావరణమే కొనసాగుతుంది.
ఇక ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈ రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.