Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్డ్ ఫ్లూ సోకినా పట్టింపు లేదు.. హైదరాబాదులో తగ్గని చికెన్ వంటకాల వ్యాపారం

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (13:24 IST)
బర్డ్ ఫ్లూ గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, చికెన్ వంటకాల పట్ల తెలంగాణ ప్రజలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. హైదరాబాదీ బిర్యానీ పట్ల హైదరాబాద్‌కు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI) వ్యాప్తిని ఎదుర్కోవడానికి కోళ్ల అమ్మకాలపై ఇటీవల ఆంక్షలు విధించినప్పటికీ, నగరం చికెన్ వంటకాల పట్ల ఆసక్తి తగ్గలేదు. రెస్టారెంట్ల నుండి రోడ్ సైడ్ తినుబండారాల వరకు, చికెన్ వంటకాలకు డిమాండ్ నిరంతరం కొనసాగుతోంది.  
 
ఫ్లూ సంబంధిత ఆందోళనల కారణంగా చికెన్ వినియోగం తగ్గుతుందని ఆశించారు. కానీ సీన్ మారింది. నగరంలో చికెన్ ధరలు చాలావరకు స్థిరంగా ఉన్నాయి, డిమాండ్‌లో గణనీయమైన తగ్గుదల లేదు. ప్రముఖ హోటళ్ళు,  రెస్టారెంట్లు తమ సాధారణ చికెన్ వంటకాలను అందిస్తూనే ఉన్నాయి. కస్టమర్లు కూడా చికెన్ వంటకాలను వదిలిపెట్టట్లేదు. 
 
దీనిపై లక్కీ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ల యజమాని అలీ రజా కజ్మీ మాట్లాడుతూ.. చికెన్ వంటకాల అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. మా కస్టమర్లు బిర్యానీ, స్టార్టర్స్‌తో సహా వారికి ఇష్టమైన వంటకాలను ఆస్వాదిస్తూనే ఉన్నారని చెప్పారు. 
 
అదేవిధంగా, షావర్మా మరియు చికెన్ 65 వంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎప్పటిలాగే సేల్ అవుతున్నాయి. బుధవారం నాటికి, హైదరాబాద్‌లో లైవ్ చికెన్ ధరలు కిలోకు రూ.80 నుంచి రూ.120 మధ్య ఉండగా, డ్రెస్డ్ చికెన్ కిలోకు రూ.180 నుంచి రూ.200 వరకు అందుబాటులో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments