Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ!

ఠాగూర్
సోమవారం, 6 మే 2024 (13:41 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె బెయిల్ కోసం దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌లపై విచారణ ఇప్పటికే పూర్తి కాగా, ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసి, తీర్పునిచ్చింది. ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలిపింది. 
 
వాదనల సందర్భంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా తన క్లయింట్ కవితను అక్రమంగా అరెస్టు చేశారని కవిత లాయర్ వాదించారు. ఈ వాదనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసుతో పాటు లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులతో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అంతకుముందు తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరచాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌నూ కోర్టు తోసిపుచ్చింది. 

వాయుసేన కాన్వాయ్‌పై దాడి నిజం కాదు.. బీజేప స్టంట్స్ : పంజాబ్ మాజీ సీఎం 
 
పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చరణ్ జిత్ సింగ్ ఛన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో పూంచ్ జిల్లాలో వాయుసేన కాన్వాయ్‌పై దాడిని బీజేపీ ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. 'ఇవన్నీ స్టంట్స్.. టెర్రరిస్టు దాడులు కాదు. ఇవన్నీ ఎన్నికలు ముందు బీజేపీ స్టంట్లు. వీటిల్లో నిజం లేదు. ప్రజల ప్రాణాలు, దేహాలతో బీజేపీ చెలగాటమాడుతోంది' అని చరCణ్ జిత్ సింగ్ అన్నారు. 
 
ఇలాంటి ఘటనలతో బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఛన్నీ ఆరోపించారు. ముందస్తు ప్రణాళికలతో బీజేపీ విజయావకాశాలు పెంచేందుకు ఈ దాడుల రూపకల్పన జరిగిందని ఆరోపించారు. 'ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి స్టంట్లు ప్లే చేస్తుంటారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి దాడులు జరిగాయి' అని ఆయన అన్నారు.
 
పూంఛ్ జిల్లాలోని సనాయ్ గ్రామంలో శనివారం ఉగ్రవాదులు వాయుసేన కాన్వాయ్‌పై ఏకే-47 రైఫిళ్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. దాడి తరువాత ఉగ్రవాదులు సమీప అడవిలోకి పారిపోయారని అధికారులు భావిస్తున్నారు. టెర్రరిస్టుల జాడ కనిపెట్టేందుకు స్థానికంగా భారీ సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ కూడా పాలుపంచుకుంది.
 
మరోవైపు ఈ దాడిని రాహుల్ గాంధీ ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడిలో అమరులైన సైనికుడికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు. దాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments