Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (12:27 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి భర్త శ్రీనివాస్‌కు ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వకంటే కసితీరా నరికి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయశాంతి భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్‌కి నాలుగేళ్ళ క్రితం ఎం.చంద్రకిరణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని శ్రీనివాస ప్రసాద్ హామీ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడంతో చంద్రకిరణ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశాడు. 
 
అయితే, చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి వద్ద పనిచేస్తున్నానని చెప్పి పలువురు రాజకీయ నేతల వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తనకు డబ్బులు ఎపుడు ఇస్తానని శ్రీనివాస ప్రసాద్‌కు నిందితుడు మెసేజ్ పెట్టాడు. ఒప్పందం జరగకున్నా డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విజయశాంతి భర్త... ఇంటికి వచ్చి మాట్లాడాలని సూచించారు. 
 
ఆ తర్వాత ఇంటికి రాలేదు సరికదా, తనకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులను రోడ్డున పడేస్తానని, కసితీరేవరకు దారుణంగా చంపుతానని బెదిరిస్తూ మేసేజ్ పెట్టాడు. దీంతో శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments