Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

Advertiesment
maheshwari

ఠాగూర్

, శనివారం, 12 ఏప్రియల్ 2025 (11:58 IST)
సభ్య సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ మంటకలిసిపోతున్నాయి. ఆస్తులు కోసం సొంత మనుషులనే అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఓ సవతి తల్లి ఆస్తి పోతుందనే భయంతో కుమార్తెను హత్య చేసి నదిలో పాతిపెట్టింది. ఇది నాలుగు నెలల తర్వాత వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన షీనా నాయక్‌కు 30 యేళ్ల క్రితం వివాహం కాగా, ఒక కుమార్తె, కుమార్తె ఉన్నారు. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుంచి కుమార్తె మహేశ్వరి వద్దే పెరిగింది. 
 
ఆ తర్వాత 2003లోనే పీనా నాయక్.. లలిత అనే ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఓ కుమార్తె కూడా ఉంది. కుమార్తె మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి, ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అక్కడ పరిచయమైన ఓ యువకుడుని మహేశ్వరి పెళ్లి చేసుకోగా, కొంతకాలానికి విభేదాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కుమార్తె, మహేశ్వరి రెండో వివాహం చేయాలని భావించి, ఇందుకోసం భారీగా డబ్బు ఇచ్చేందుకు సైతం తండ్రి సిద్ధమయ్యాడు. 
 
ఇందుకోసం బోడుప్పల్‌లో తనకున్న రెండు గృహాల్లో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించాడు. దీంతో ఆస్తి పోతుందని సవతి తల్లి లలిత, తన మరిది సీఆర్పీఎఫ్ జవాన్ బానోత్ రవి, అతడి స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు. 
 
గత యేడాది డిసెంబరు 7వ తేదీన ఉద్యోగ పనులపై పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయం చూసి ఈ ముగ్గురు కలిసి మహేశ్వరిని నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసి నదిలో పూడ్చిపెట్టారు. 
 
పీనా నాయక్ తిరిగి ఇంటికి రాగానే కుమార్తె వేరే అతనితో వెళ్లిపోయిందని నమ్మబలికారు. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భార్య చెప్పింది. దీంతో పీనా నాయక్ మిన్నకుండిపోయాడు. అయితే, కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు నెలలు అయినా కుమార్తె జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా అసలు విషయం బహిర్గతమైంది. మహేశ్వరిని ఆస్తి కోసం హత్య చేసినట్టు లలిత అంగీకరించారు. దీంతో ఈ హత్య కేసులోని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్