Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (15:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణంలో భీష్మ నగర్‌కు చెందిన బింగి రాజశేఖర్, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యల వివాహం 2014లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, రాజశేఖర్‌కు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన హిజ్రా దీపుతో పరిచయం ఏర్పడి, అది సన్నిహింతగా మారింది. దీంతో గత కొంతకాలంగా వీరిద్దూర సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. 
 
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య లాస్య, రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసినప్పటికీ భార్యను చూసేందుకు రాజశేఖర్ వెళ్లేదు. 
 
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు రాజశేఖర్ - హిజ్రా దీపుల వ్యవహారాన్ని పోలీసులకు చేరవేసి వారిద్దరి కోసం గాలించసాగారు. ఈ క్రమలో రాజశేఖర్ భీష్మ నగర్‌లోని ఓ ఇంటిలో హిజ్రాతో ఉండటాన్ని గమనించి గదికి తాళం వేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి దీపు, రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments