Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పంటల సాగు బాగా తగ్గిపోయింది.. కేటీఆర్ ఫైర్

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (12:54 IST)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల సాగు బాగా తగ్గిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లను, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో సాధించిన ప్రగతికి భిన్నంగా ఆయన ఎత్తిచూపారు. 
 
తెలంగాణలో నాట్లు 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే పూర్తయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే 15.3 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని, దీంతో మొత్తం పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కేటీఆర్ సూచించారు. 
 
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన స్థిరమైన అభివృద్ధిని కూడా కాంగ్రెస్ నాయకత్వం చేయలేకపోతోందని స్పష్టంగా రుజువు చేస్తోంది. కే చంద్రశేఖర్‌రావు హయాంలో వ్యవసాయం స్వర్ణయుగంగా పరిణమించిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రైతులకు సాగునీరు, విత్తనాలు, ఎరువులు వంటి అవసరమైన ఇన్‌పుట్‌లను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని వుంది : జూనియర్ ఎన్టీఆర్

నా ఫేవరేట్ డైరెక్టర్ ఒప్పుకుంటే డైరెక్ట్ తమిళ సినిమా చేస్తా : ఎన్.టి.ఆర్.

అరెస్టు వెనుక ఆర్థిక, రాజకీయ, అంగబలం : ముంబై నటి జెత్వానీ

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments