Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (10:29 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 75 శాతం హాజరువున్న డిగ్రీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో 75 శాతం హాజరుశాతం లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వరాదని వీసీల భేటీ నిర్ణయించారు. 
 
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ వర్శిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఇందులో డిగ్రీలో కనీసం 75 శాతం హాజరులేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ, అవి అమలు కావడం లేదని ఉపకులపతులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. 
 
దీంతో ఈ సారి మాత్రం ఆ నిబంధనలను తప్పకుండా అమలు చేయాలని వీసీలకు చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీంతో కొంతమేరకు విద్యాప్రమాణాలు పెరగడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం కూడా గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే, మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా, వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments