Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్రపాలికి షాకిచ్చిన కేంద్రం : ఏపీకి వెళ్లాలంటూ ఆదేశం

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (23:01 IST)
గ్రేటర్ హైదరాబాద్ మన్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి కాటాకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. తక్షణం సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. అయితే, తమను తెలంగాణాలోనే కొనసాగించాలని ఆమెతో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులు చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. 
 
తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గానేకాకుండా పలు కీలక బాధ్యతలను ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అలాగే, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్ కూడా విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
 
అయితే, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్,, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులు ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి వీరితో పాటు మొత్తం 11 మంది అధికారులు తెలంగాణ కేడర్ కావాలంటూ కేంద్రాన్ని కోరారు. 
 
కానీ, వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అధికారులు అందరూ సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల పేరుతో లేఖను రాస్తూ వాటి కాపీలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments