Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విషయంలో ఒత్తిడికి గురైన టెక్కీ... దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య!!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (14:45 IST)
పెళ్ళి విషయంలో ఒత్తిడికిలోనై ఓ యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. రాయదుర్గం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ (25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన ఆఫీసుకు వెళ్లిన బాలాజీ రాత్రి పొద్దుపోయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా, స్విచాఫ్ అని వచ్చింది. అతడి స్నేహితులను కనుక్కున్నా బాలాజీ జాడ తెలియరాలేదు. దీంతో వారు మరుసటి రోజు రాయదుర్గం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలాజీ పని చేస్తున్న కంపెనీలో విచారించగా అతడు ఆ రోజు పని ముగించుకుని రాత్రి 8.30 గంటలకు బయటకు వెళ్లినట్టు తెలిసింది. దీంతో, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడు కేబుల్ బ్రిడ్జి నుచి దుర్గంలో చెరువులోకి దూకినట్టు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం చెరువులో అతడి మృతదేహం లభించింది. ఐడీ కార్డుతో మృతుడిన బాలాజీ గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించ్ారు. 
 
కాగా, బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయగా ఈ విషయాన్ని బాలాజీ తన ఇంట్లోవారికి చెప్పలేక ఒత్తిడి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిజిటిల్ రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకురానున్న ఓటీటీ గ్లోపిక్స్

Sreeleela: 2025లో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఖాయమా? కరణ్ జోహార్ చేతిలో పడితే?

దశావతార ఆలయం నేపధ్యంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర ఫస్ట్ లుక్

మైథలాజికల్ పాయింట్‌తో రాబోతోన్న బార్బరిక్ హిట్ గ్యారంటీ : దర్శకుడు మారుతి

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments