Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్ల కోసం వచ్చి మంగళసూత్రం లాక్కెళ్లిన ముసుగుదొంగ (Video)

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (19:12 IST)
హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచింగ్ దొంగలు ఎక్కువైపోతున్నారు. సూటుబూటు వేసుకుని ఏదో ఒక సాకుతో ఇంట్లోకి వచ్చి మహిళల మెడలో ఉండే విలువైన బంగారు ఆభరణాలను లాక్కెళుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మంచినీళ్లు కావాలంటూ ముసుగు ధరించి వచ్చిన ఓ చైన్ స్నాచర్... మహిళ మెడలోని మంగళ సూత్రాన్ని లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ మహిళ ఉదయాన్నే నిద్రలేని ఇంటి వాకిలి శుభ్రం చేసి, ముగ్గు వేసుకుంటుంది. ఇంతలో ఓ యువకుడు ఖాళీ బాటిల్ తీసుకుని వచ్చి మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ వ్యక్తి ముఖానికి మంకీ క్యాప్ ధరించివున్నాడు. మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు ఇంటిలోకి వెళ్లగానే ఆ వ్యక్తి గేటు దాటుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. 
 
ఆ తర్వాత చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించి, ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని పారిపోయాడు. దీంతో ఆ మహిళ బిగ్గరగా అరుచుకుంటూ బయటకి వచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే ఆ దొంగ కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చైన్ స్నాచింగ్‌కు గురైన మంగళసూత్రం బరువు రెండున్నర సవర్ల మేరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

Actress Soundarya: నటి సౌందర్య ఎలా మరణించింది? 32 సంవత్సరాలే.. గర్భిణీ.. గుర్తుపట్టలేనంతగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం
Show comments