Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (08:56 IST)
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ చార్జీలు పెరగనున్నాయి. కొత్తగా పెంచిన ధరలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి రోజూ మెట్రో రైళ్లలో లక్షలాది మంది నగర వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి మెట్రో రైళ్లలో చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సవరించిన నూతన చార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
ప్రస్తుతం కనీస చార్జీ రూ.10గా ఉంటే దాన్ని రూ.12కు పెంచారు. అదేవిధంగా గరిష్ట ప్రయాణ చార్జీ రూ.60 నుంచి రూ.75కి పెంచారు. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా చార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు పెరిగన చార్జీలు ఇలా ఉన్నాయి. 
 
తొలి రెండు స్టేషన్ల వరకు ప్రయాణ కనీస చార్జీ రూ.12గా నిర్ణయించగా, 2 నుంచి 4 స్టేషన్ల మధ్య ప్రయాణిస్తే రూ.18, 6 నుంచి 9 స్టేషన్ల వరకు ప్రయాణిస్తే రూ.30, 9 నుంచి 12 స్టేషన్ల వరకు ప్రయాణిస్తే రూ.50, 12 నుంచి 15 స్టేషన్ల వరకు రూ.55, 15 నుంచి 18 స్టేషన్ల వరకు రూ.60, 18 నుంచి 21 స్టేషన్ల వరకు రూ.66, 21 నుంచి 24 స్టేషన్ల వరకు రూ.70, 24 స్టేషన్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టయితే రూ.75గా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments