Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

Advertiesment
victim girl

సెల్వి

, బుధవారం, 14 మే 2025 (08:59 IST)
ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తు కారులోనే ఇరుక్కుని ఆ బాలిక మరణించింది. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ గంగాధర్ చందా మాట్లాడుతూ, ఆ చిన్నారి ఆదివారం ఉదయం తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి చర్చికి వెళ్లింది. 
 
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, బాలిక కారులోనే ఉంది. సాయంత్రం మాత్రమే ఆమె తల్లి బిడ్డ కనిపించడం లేదని గమనించి తన భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఆమె కోసం వెతకడం ప్రారంభించగా, ఆపి ఉంచిన వారి కారు తలుపు కొద్దిగా తెరిచి ఉండటం పొరుగువాడు గమనించాడు. వారు లోపల తనిఖీ చేసినప్పుడు, బాలిక శరీరం అంతటా దద్దుర్లుతో అపస్మారక స్థితిలో కనిపించింది. అప్పటికి ఆమె చనిపోయింది. 
 
ఈ ఘటనపై బాలిక తండ్రి మాట్లాడుతూ.. ఆమె కారులోనే వుండటం ఎవరికీ తెలియదని.. ఆ అమ్మాయి తనకు బొమ్మలు కొనిపెట్టలేదనే కోపంతో కారులోనే వుండిపోయింది. పార్కింగ్ ఏరియా కారులతో నిండిపోవడంతో.. బయట ఎండలోనే కారును నిలబెట్టాల్సి వచ్చిందని.. ఆ వేడిని బిడ్డ తట్టుకోలేకపోయింది. ఊపిరాడక వాంతులు చేసుకుందని తెలిపారు. అలా ప్రాణాలు కోల్పోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు