Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (18:21 IST)
సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌లో ఎక్కువైపోతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధ జంటను రూ.10.61 కోట్ల మేర మోసం చేశారు. వివరాల్లోకి వెళితే.. మోసగాళ్లు వృద్ధుడిని వాట్సాప్ ద్వారా సంప్రదించారని, అతని పేరు మీద ముంబైలో బ్యాంక్ ఖాతా తెరిచినట్లు చెప్పారు. 
 
ఇక, జూలై 8న మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ, నకిలీ మెసేజ్ లు పంపడంతో పాటు ఆ జంటను భయపెట్టే వ్యూహాలను ఉపయోగించారు. ఇక ఆ మనీలాండరింగ్ కేసు నుండి అతని పేరును క్లియర్ చేయడానికి వారి ఆదేశాలను అనుసరించమని స్కామర్లు బాధితుడికి సూచించారు. 
 
ఇక భయంతో వణికిపోయిన ఆ జంట స్కామర్ల వలలో చిక్కుకున్నారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో నిధులు తిరిగి వస్తాయని పేర్కొంటూ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేయమని వారు ఒప్పించారు. 
 
ఈ క్రమంలో ఆ వృద్ధ జంటను జులై 8 నుంచి 26వ తేదీ వరకు 11 వాయిదాల్లో మొత్తం రూ.10.61 కోట్లను మోసం చేశారు. ఆపై మోసపోయామని తెలుసుకున్న ఆ జంట సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments