Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (18:29 IST)
తన తండ్రి గద్దర్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు ఇతర బీజేపీ తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలను గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ తిప్పికొట్టారు. పదవుల కోసమో, డబ్బు కోసమే, అవార్డుల కోసమో తన తండ్రి పని చేయలేదనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 
 
గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఐదు పేర్లలో ఒక్కరికి కూడా పద్మ అవార్డును కేంద్రం ప్రకటించలేదు. దీంతో సీఎం రేవంత్ నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వమని తెగేసి చెపుతూ గద్దర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 
 
వీటిని వెన్నెల గద్దర్ తీవ్రంగా ఖండించారు. తన తండ్రి పదవుల కోసమో, డబ్బు కోసమో, అవార్డుల కోసమో పని చేయలేదన్నారు. తెలంగాణ కోసం, పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాడారని గుర్తు చేశారు. శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని కూడా ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్ అని గుర్తు చేశారు. మీరు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన గద్దర్ స్థాయి తగ్గదన్నారు. అసలు అవార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమా? లేక బీజేపీ పార్టీనా? అంటూ సూటిగా ప్రశ్నించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments