Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం : జి.కిషన్ రెడ్డి

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (17:19 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డికి కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే మోడీ 3.0 ప్రభుత్వంలో మరోమారు కేంద్ర మంత్రి పదవి వర్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చేస్తామని ఆయన తెలిపారు. సంకల్పపత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు. 
 
తెలంగాణలో గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రోడ్లు, రేషన్‌ బియ్యం, గ్రామాలకు మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
 
రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ పరిధిలో తన గెలుపు కోసం పని చేసిన పదాధికారులు, మోర్చాల అధ్యక్షులకు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌ పోటీ చేసిందని, అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారన్నారు. మోడీ ప్రమాణస్వీకారం పూర్తికాగానే మేళతాళాలతో కార్యక్రమాలను నిర్వహించాలని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని, రాష్ట్రంలోనూ ఆ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆదేశిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments