Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ భవన్‌లోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడుకి నో ఎంట్రీ!

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (08:24 IST)
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సోదరుడు, మాజీ ఎంపీ మల్లు రవికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్‌లో బుధవారం పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు మల్లు రవి రాగా పోలీసులు గాంధీ భవన్‌లోకి అనుమతివ్వలేదు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలియడంతో పోలీసులు ఇతరులను లోపలికి అనుమతించలేదు. దీంతో మల్లు రవిని కూడా మెయిన్ గేట్ వద్దే నిలిపివేశారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తననే అడ్డుకుంటారా అంటూ గొడవకు దిగారు. చివరకు ఆయనను పోలీసులు అనుమతించగా, తనతో వచ్చిన వారిని కూడా లోపలకు పంపించాలని నానా హంగామా సృష్టించారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌లో బుధవారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన మల్లు రవికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆయన స్వయాగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు కావడం గమనార్హం. 
 
'లవ్ గురు'గా మారిపోయిన పాకిస్తాన్ ప్రధాని.. 82 యేళ్ల వయుసులో కూడా.. 
 
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈయన ఇపుడు లవ్ గురుగా మారిపోయారు. 82 యేళ్ల వయసులోనూ వివాహం చేసుకోవచ్చని చెబుతున్నాడు. 52 యేళ్ల వ్యక్తి తనకు నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా అని ఓ పౌరుడు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానిచ్చారు. 
 
82 యేళ్ల వయుసులోనూ పెళ్లిని పరిగణించవచ్చన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు పౌరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏమాత్రం వెనుకంజ వేయకుండా సమాధానాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన జీవితంలో ఎవరినీ ఆకర్షించడానికి ప్రయత్నించలేదని, అయితే తాను చాలా మందిని ఆకట్టుకున్నానని చెప్పారు. డబ్బులేని వారు ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏంచేయాలని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 
 
ప్రేమ ఒక అవకాశంగా దొరుకుతుంది. ఉద్యోగం సామర్థ్యాన్ని బట్టి లభిస్తుంది. కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దు అంట ప్రేమకే మద్దతిచ్చారు. ఇక పిచ్చి అత్తగారు దొరికితే ఏం చేయాలని మరొకరు ప్రశ్నించగా, విపత్తు నిర్వహణ కోర్సులో చేరాలని సరదాగా సమాధానమిచ్చారు. కాగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయిన పాకిస్థాన్‌కు అన్వర్ ఉక్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. వచ్చే నెల ఎనిమిదో తేదీన పాకిస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల తర్వాత పాకిస్థాన్ దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments