Constable: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు... రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య

సెల్వి
మంగళవారం, 4 నవంబరు 2025 (09:29 IST)
స్మార్ట్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనానికి బానిసై.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. కల్హేర్‌కు కొటారి సందీప్ కుమార్ (25) సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సందీప్ కుమార్ కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. వాటి కోసం బంధువులు, స్నేహితుల వద్ద లక్షల రూపాయలు అప్పు చేశాడు. 
 
అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి పదిహేనేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించగా, సందీప్‌కు తల్లి, చెల్లి ఉన్నారు. అతడికి ఇంకా వివాహం కాలేదు. 
 
సూసైడ్ లెటర్‌లో అమ్మను చెల్లిని క్షమించమని కోరాడు. తాను ఇకపై మిమ్మల్ని బాధపెట్టనని.. తన తల్లిని, చెల్లిని ఎవరూ ఏమీ అనకండి.. అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Monalisa : కుంభమేళా భామ మోనాలిసా కథానాయికగా లైఫ్ చిత్రం ప్రారంభం

Nagarjuna: డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో శివ రీరిలీజ్ - చిరంజీవిలా చిరస్మరణీయం : వర్మ

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments