విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. రూ.85వేల కోట్ల అప్పులా?

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (18:16 IST)
విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష ప్రారంభమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎండీ ప్రభాకర్‌రావు గైర్హాజరయ్యారు. సీఎండీ ప్రభాకర్ రావు ఈ నెల 3న తన పదవికి రాజీనామా చేశారు.
 
రాజీనామా చేసినా సమీక్షకు హాజరు కావాలని సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ స్వయంగా ఆహ్వానించినా సీఎండీ ప్రభాకర్ రావు సమావేశానికి హాజరుకాలేదు. గురువారం విద్యుత్ శాఖపై సీఎం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. 
 
విద్యుత్ శాఖలో రూ.85 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సీఎండీ ప్రభాకరరావును సమీక్షకు తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే శుక్రవారం విద్యుత్ శాఖ ప్రత్యేక సమీక్షకు సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
 
ఇంకా విద్యుత్ సంస్థలకు రూ.85వేల కోట్ల అప్పులా అంటూ రేవంత్ రెడ్డి షాకయ్యారు. అంతేగాకుండా అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో సమీక్షకు రావాల్సిందిగా ఆదేశించారు. ఇంకా సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దని.. సమీక్షకు రప్పించాల్సిందిగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 
అలాగే కాళేశ్వరంపై విచారణ జరపాల్సిందిగా రేవంత్ రెడ్డి అన్నారు. రీడిజైన్ పేరుతో ఎస్టిమేషన్లను పెంచడం, వేల కోట్ల ప్రజాధనం దోపిడీ అయ్యిందని లాయర్ రాపోలు ఫిర్యాదు చేశారు. అలాగే కేసీఆర్, హరీశ్‌లపై చర్యలు తీసుకోవాలని రాపోలు డిమాండ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments