Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్.. రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన

ఠాగూర్
శుక్రవారం, 8 మార్చి 2024 (20:45 IST)
భాగ్యనగరి (హైదరాబాద్)కి మరిన్ని సొబగులు రానున్నాయి. తొలిసారి డబుల్ డెక్కర్ కారిడార్‌ రానుంది. ఈ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజ‌లు, వాహ‌న‌దారుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేలా కారిడార్‌ను నిర్మించనున్నారు. 
 
జాతీయ ర‌హ‌దారి-44పై రూ.1,580 కోట్ల వ్యయంతో చేప‌ట్టనున్న 5.320 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై త‌ర్వాత మెట్రో మార్గం నిర్మించ‌నున్నారు. కండ్లకోయ జంక్షన్‌ నుంచి తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌కు ప్రస్థానం ప్రారంభం కానుంది.
 
ఈ కారిడాడర్‌ సికింద్రాబాద్‌లోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి మొద‌లై తాడ్‌బండ్ జంక్షన్‌, బోయిన‌ప‌ల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్‌ రోడ్డు వ‌ద్ద ముగుస్తుంది. దీని మొత్తం పొడ‌వు 5.320 కి.మీ. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కి.మీ., అండ‌ర్‌ గ్రౌండ్‌ ట‌న్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. మొత్తం 131 స్తంభాలు ఉంటాయి. మొత్తం ఆరు వ‌రుస‌ల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు.
 
ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా బోయిన‌ప‌ల్లి జంక్షన్ స‌మీపంలో ఇరువైపులా రెండు చోట్ల ర్యాంపులు నిర్మించనన్నారు. ఇది పూర్తయిన త‌ర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం నిర్మించ‌నున్నారు. ఫ‌లితంగా ఆ మార్గంలో ప్రయాణం మ‌రింత వేగంగా సాగ‌నుంది.
 
ఎలివేటెడ్‌ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యార‌డైజ్‌ జంక్షన్ మీదుగా రోజుకు స‌గ‌టున 1,57,105 వాహ‌నాలు.. ఓఆర్‌ఆర్‌ జంక్షన్ స‌మీపంలో 72,687 వాహ‌నాలు ప్రయాణిస్తున్నాయి. ఇరుకైన ర‌హ‌దారి కావ‌డం, భారీగా వాహ‌న రాక‌పోక‌ల‌తో నిత్యం వాహ‌న‌దారులు, ఆయా ప్రాంతాల ప్రజ‌లు అవ‌స్థలు ప‌డుతున్నారు. త‌ర‌చూ ప్రమాదాల‌తో ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో స‌మ‌యంతో పాటు ఇంధ‌న వ్యయం, ప్రమాదాల సంఖ్య త‌గ్గనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments