Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో నమ్మకం పొందేలా పని చేయండి.. కలెక్టర్లు - ఎస్పీలకు సీఎం రేవంత్ సూచన

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (09:41 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. క్రమంగా అటు ప్రభుత్వంతో పాటు ఇటు పాలనపై క్రమంగా పట్టుసాధించేలా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఉన్నతాధికారులపై ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. అయితే, ప్రజల్లో నమ్మకం కలిగేలా పని చేయాలని ఆయన హితవు పలికారు. 
 
'మీరు వివిధ రాష్ట్రాల్లో పుట్టి పెరిగి, ఆలిండియా సర్వీసు పోటీ పరీక్షలు రాసి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చారు. ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి పౌరులతో మమేకం అయ్యారు.
 
మాది వేరే రాష్ట్రం అనో, మా భాష వేరు అనో మీరెవరూ భావించాల్సిన పనిలేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ కోణంలో చూడడంలేదు, ఎలాంటి వివక్ష చూపించడంలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసులు గెలవండి. రాజకీయనేతలకు ఐదేళ్ల కాలపరిమితి, మీకు 35 ఏళ్ల సర్వీసు ఉంటుంది. అన్ని సంవత్సరాల సర్వీసును మీకందిస్తున్నారంటే, మీరు ఎంత జవాబుదారీతనంతో వ్యవహరించాలో అర్థం చేసుకోండి.
 
కొంతమంది అధికారులు బదిలీ అయి వెళ్లిపోతున్నప్పుడు ప్రజలు సన్మానాలు చేయడం చూస్తుంటాం... ఓ మంచి అధికారిని ప్రభుత్వం బదిలీ చేస్తోందని కన్నీరు పెట్టుకుంటారు. మీరు కూడా ప్రజల్లో నమ్మకం పొందేలా పనిచేయండి. మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా బాధ్యతతో మెలగండి" అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అదేసమయంలో పని చేయని అధికారులకు కూడా ఆయన గట్టివార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి అధికారులు ఇంటికి వెళ్లేలోపు బదిలీ ఆర్డర్లు వస్తాయని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments