Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (09:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ అధికారులను అడుక్కోవడం ఏమిటని తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్నారు. తిరుమలకు వెళ్లే బదులు మన రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించాలని ఆయన సూచించారు. 
 
తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని, తితిదే అధికారులను అడుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరి గుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా? మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా? అని ప్రశ్నించారు. 
 
తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణాలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇపుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే మన రాష్ట్రానికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments