Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజగదిలో రేవంత్ రెడ్డి ఫోటో.. పూజలు చేస్తోన్న కుమారీ ఆంటీ - video viral

Advertiesment
Kumari aunty

సెల్వి

, బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (12:51 IST)
Kumari aunty
సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని దేవుడి గదిలో పెట్టి కుమారి ఆంటీ పూజ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్ సైడ్ బిజినెస్ ద్వారా కుమారి ఆంటీ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆమె హోటల్‌ను గతంలో తొలగించవద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా అటు వైపు వెళ్లినప్పుడు ఆమె చేతి వంట రుచి చూస్తానని చెప్పడంతో మీడియా మొత్తం ఆమెను హైలెట్ చేసింది. 
 
హైదరాబాద్‌ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాగా పేరున్న మదాపూర్ ఐటీసీ కోహినూర్ సమీపంలో ఆమె ఫుడ్ స్టాల్ నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారీ ఆంటీనే దర్శనమిచ్చేది. గతేడాది సంభవించిన వరదల్లో ఖమ్మం జిల్లాల్లో అపార నష్టం వాటిల్లగా.. కుమారీ ఆంటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం కూడా అందించారు. 
 
ఇక గతంలో తన ఫుడ్ స్టాల్ తొలగించొద్దని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నారు. ఆయన్ను దేవుడిగా ఆరాధిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో వైరల్.. హా హా వావ్ అంటోన్న ఎలెన్ మస్క్ (Video)