Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ బస్సులో ప్రయాణీకురాలిపై క్లీనర్ అత్యాచారం.. మాటలు కలిపి.. వాటర్ బాటిల్ ఇచ్చి.. ?

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:36 IST)
మహిళలకు భద్రత కరువవుతోంది. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ మహిళా ప్రయాణీకురాలిపై అత్యాచారం జరిగింది. బస్సులో పనిచేసే హెల్పర్ ఓ మహిళా ప్రయాణికురాలిని నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఏపీకి వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో ఆమెను బెదిరించి ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేశాడని కూకట్‌పల్లి పోలీసులు  తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయికుమార్‌రెడ్డిని అరెస్టు చేశారు. నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

జులై 3న కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం చేసినందుకు సహ డ్రైవర్‌ని అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణను నాచారం సమీపంలో పట్టుకున్నారు. ఆ సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో కృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
తాజా సంఘటనలో, కూకట్‌పల్లి నుండి తన స్వస్థలమైన ఏపీలోని సామర్లకోటకు వెళ్లేందుకు సాయి కుమార్ బాధితురాలిని నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి.. ఆమెతో మాటలు కలిపి, సీటు మార్చి... డ్రింకింగ్ వాటర్ బాటిల్ ఇచ్చి ఆపై నిర్భంధించి రెండుసార్లు బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సాయి కుమార్ బాధితురాలిని బెదిరించి, రెండోసారి దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం బస్సు స్టాప్‌లో ఆగిన బాధితురాలు బస్సు దిగి ట్రావెల్‌ కంపెనీ యజమాని అనిల్‌రెడ్డికి ఫోన్‌ చేసింది. 
 
అనిల్ రెడ్డి బాధితురాలితో కలిసి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును కూకట్‌పల్లి పోలీసులకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం కూకట్‌పల్లి పోలీసులు మహిళా పోలీసుల సమక్షంలో బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసి కేసు నమోదు చేసి (1215 ఆఫ్ 2024) సాయికుమార్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments