బాలికపై సీఐ అత్యాచార యత్నం, పరారీలో పోలీసు అధికారి

ఐవీఆర్
గురువారం, 24 అక్టోబరు 2024 (22:35 IST)
హన్మకొండ పట్టణం వడ్డెపల్లిలో బాలికపై సీఐ ర్యాంక్ అధికారి ఒకరు అత్యాచార యత్నం చేసాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు కాజీపేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ రవికుమార్... బాలిక నివాసం వుండే ప్రాంతంలోనే ఓ అపార్టుమెంట్లో వుంటున్నారు.
 
ఈ క్రమంలో బాలికను ఇంట్లోకి పిలిచి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతడు ప్రస్తుతం పరారీలో వున్నట్లు చెబుతున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సీఐ అత్యాచారానికి యత్నించడం మీడియాలో రావడంతో రక్షించాల్సిన పోలీసులే ఇలా అఘాయిత్యానికి పాల్పడితే ఇక రక్షించేది ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments