Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌పై కేసు నమోదు.. రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడారట..!

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (11:22 IST)
హన్మకొండలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేటీఆర్‌పై హన్మకొండ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసును బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీఐ సతీశ్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఈ సందర్బంగా బత్తిని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్స్ దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని కేటీఆర్ లేనిపోని అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments