ఢిల్లీ లిక్కర్ కేసు : విచారణకు రాలేనంటూ ఈడీకి కవిత లేఖ

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (09:50 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను విచారణకు హాజరుకాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత లేఖ రాశారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ కె.కవితకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నోటీసుల్లో ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఈ కేసులో గత యేడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ అధికారులు వించారించారు. తాజాగా మరోమారు నోటీసులు పంపించింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‍కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు జారీచేసింది. 
 
కానీ, ఆయన మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలంటూ మరోమారు అంటే నాలుగోసారి నోటీసులు జారీచేసింది. అయితే, తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కవితకు ఈడీ మరోమారు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇదిలావుంటే ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ నోటీసులపై కవిత స్పందించారు. విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఇదే కేసులో గతంలో కవితకు ఈడీ నోటీసులు పంపించి మూడుసార్లు విచారణ జరిపింది. నాలుగోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలను ఇంటివద్ద లేదా వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరపాలని తన విటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments