Webdunia - Bharat's app for daily news and videos

Install App

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

సెల్వి
శనివారం, 21 డిశెంబరు 2024 (16:48 IST)
Revanth Reddy
పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. సినిమా రంగ అభివృద్ధికి ప్రోత్సాహం చేస్తాం అంటూనే.. ప్రజల ప్రాణాలతో చెలగాడితే ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీలో కూర్చున్నంతవరకు ఒప్పుకునేది లేదంటూ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. ఆ వెంటనే సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపులను బెనిఫిట్ షోలను బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 
 
అయితే ప్రభుత్వ ఈ నిర్ణయం పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం. సంధ్య థియేటర్‌కు వెళ్లే ముందు రోడ్ షో చేసుకుంటూ వెళ్లిన అల్లు అర్జున్.. రేవతి అనే మహిళ మరణించిందని బయటికి వెళ్లాల్సిందేనని పోలీసులు చెప్పాక కూడా.. కారు టాప్ తీసి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రోడ్ షోల కారణంగా తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు.
 
అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు.. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది.. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. 
 
థియేటర్‌లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సెలెబ్రిటీలు విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments