హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వా భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించాయి.
సత్వా ఎలిక్సిర్ భవనంలోని ఐదవ అంతస్తులో జరిగిన ఈ సంఘటనతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
సిలిండర్ పేలుళ్ల కారణంగా భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమీపంలోని ఐటీ కంపెనీ ఉద్యోగులను భద్రత కోసం అధికారులు ఖాళీ చేయించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.