Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పాఠశాలల్లో డెంగ్యూ, చికున్‌గున్యా.. తగ్గిన అటెండెన్స్

సెల్వి
బుధవారం, 28 ఆగస్టు 2024 (10:06 IST)
తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది. గత నెల రోజులుగా, వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్ కేసుల పెరుగుదల కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 15 నుండి 25 శాతం వరకు తగ్గినట్లు నివేదికలో వెల్లడి అయ్యింది.
 
నగరంలోని పాఠశాలల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావట్లేదు.  గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా పారిశుధ్యం, తక్కువ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్న ప్రదేశాలలో ఇది ఎక్కువగా ఉంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పెరుగుతున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలకు అంటువ్యాధి సోకుతుందనే భయంతో పాఠశాలలకు పంపడానికి ఇష్టపడట్లేదు. 
 
సాధారణంగా పాఠశాలల్లో 85 శాతం హాజరు నమోదవుతుంది. అయితే, వైరల్ ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో హాజరు శాతం 20 శాతం పడిపోయింది. 
 
కొద్ది రోజుల క్రితం ఖమ్మంలోని ఒకే ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు చికున్‌గున్యా వచ్చిందని అని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం