Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా... ఏంటది?

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (09:53 IST)
భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా తేరుకోలేని షాకిచ్చింది. 2025 విదేశీ విద్యార్థులను సంఖ్యను ఏకంగా 2.7 లక్షలకు తగ్గించేసింది. ఉన్నత విద్య, వృత్తి విద్యా, ట్రైనింగ్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితంచేస్తూ ఆస్ట్రేలియా విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఇది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఒకటైన ఆస్ట్రేలియా ఒకటిగా ఉంది. అలాంటి ఆస్ట్రేలియా పాలకులు 2025లో దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను 2.7 లక్షలకు తగ్గించింది. రికార్డు స్థాయిలో వలసలు కొనసాగుతున్న పర్యవసానంగా దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెల కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
పరిమితం చేయనున్న సీట్లకు సంబంధించి ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ట్రైనింగ్ కోర్సులు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. 
 
ఈ పరిణామంపై ఆస్ట్రేలియా మైగ్రేషన్ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ అథారిటీ సభ్యుడు సునీల్ జగ్గీ స్పందించారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని 2022లో ఆస్ట్రేలియా 5.10 లక్షలకు పరిమితం చేసిందని, ఈ సంఖ్యను 2023లో 3.75 లక్షలకు కుదించిందని ప్రస్తావించారు. వార్షిక ప్రణాళికల్లో భాగంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తాజాగా మరింత తగ్గించారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గింపు అంతర్జాతీయ విద్యార్థులు అందరికీ వర్తిస్తుందని, భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదని అన్నారు.
 
ఆస్ట్రేలియాలో చదువు కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ ప్రకటన ప్రభావం చూపుతుందని, పంజాబ్‌కు చెందిన విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతారని ఆయన అంచనా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments