Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

ఠాగూర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (18:22 IST)
హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచన చేసింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ అఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా చేసుకుని కోర్టు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది 
 
జైలు సూపరింటెండెంట్‌కు అన్నీ డాక్యుమెంట్స్‌ ఇవ్వాలని ఆదేశించింది. తీర్పు కాపీని చదివి అరెస్టు వరకు దారి తీసిన పరిణామాలను న్యాయమూర్తి రికార్డు చేశారు. ఆ తర్వాత వ్యక్తి గత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశించారు. 
 
మరోవైపు, అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమన్నారు. ఆక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదన్నారు. నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదన్నారు. 
 
అర్జు‌న్‌ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా.. ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడిన దాఖలాలు లేవన్నారు. ఒకవేళ రిమాండ్ వేసినా ఈ రోజో, రేపో బెయిల్ వస్తుందన్నారు. శుక్రవారం అరెస్టు చేయడం అన్నది జగన్ మోహన్ రెడ్డి పార్టీ విధానమన్నారు. గతంలో తనను కూడా అలానే అరెస్టు చేసారని గుర్తుచేశారు. 
 
ఒకవేళ ఘటనకు బాధ్యులను చేయాల్సి వస్తే బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన వాళ్ళను, టికెట్స్ పెంచుతూ అనుమతి ఇచ్చిన వాళ్ళను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments