Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allu Arjun: అల్లు అర్జున్‌కు వరుణ్ ధావన్ మద్దతు.. ఏ టాలీవుడ్ హీరో నోరెత్తలేదే..? (video)

Advertiesment
Varun Dhawan

సెల్వి

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (16:00 IST)
Varun Dhawan
డిసెంబర్ 4న హైదరాబాద్‌లో పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ఈ సంఘటనలో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. 
 
ఈ కార్యక్రమం గురించి అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, అతని భద్రతా బృందంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. 
 
ఈ అరెస్టుతో అల్లు అర్జున్ అభిమానులు, మీడియా దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, టాలీవుడ్ నటులు చాలావరకు మౌనంగా ఉండిపోయారు. అల్లు అర్జున్‌కు మద్దతుగా ఎవరూ నోరెత్తలేదు. 
 
అయితే, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించాడు. "ఒక నటుడు తనంతట తానుగా ప్రతిదీ భరించలేడు. ఇది దురదృష్టకరం" అని అల్లు అర్జున్‌కు మద్దతు ఇస్తూ, బహిరంగ కార్యక్రమాలలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని గుర్తు చేశారు. సేఫ్టీ ప్రోటోకాల్ అనే విషయంలో వైఫల్యం జరిగితే హీరోపై కేసులు వేయడం, అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అయితే మృతురాలి కుటుంబానికి వరుణ్ ధావన్ సంతాపం వ్యక్తం చేశారు. అలా జరిగి వుండకుండా వుండాల్సింది.. అది అనూహ్యంగా జరిగింది. ప్రోటోకాల్ పాటించాలి. భద్రతను ఇంకా మెరుగు పరచాల్సిందని వరుణ్ అన్నారు. 
 
ఇకపోతే.. అల్లు అర్జున్ త్వరలో మేజిస్ట్రేట్ ముందు హాజరు కానున్నారు. అల్లు అర్జున్‌‌కు వైద్య పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఈ క్రమంలోనే చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు, వరుణ్ ధావన్ డిసెంబర్ 25న విడుదల కానున్న తన రాబోయే చిత్రం బేబీ జాన్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన చిరంజీవి, సురేఖ దంపతులు