Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన చిరంజీవి, సురేఖ దంపతులు

Advertiesment
Surekha, chiranjeevi at allu arjun house

డీవీ

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (15:50 IST)
Surekha, chiranjeevi at allu arjun house
అల్లు అర్జున్ అరెస్ట్ తదంతర పరిణామాలు నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలు తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారనేది టాక్ అందరికీ నెలకొంది. అందుకే కొద్ది సేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు వెళ్ళారు. బయట మీడియాఅంతా వున్నా వారితో ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళారు. ఇక ఇంటిలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డిని కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. 
 
అల్లు అర్జున్ కూ చిరంజీవి కుటుంబానికి తేడాలున్నాయని ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి టైంలో అండగా వుండాలని పెద్దతరహాలో చిరంజీవి ప్రవర్తించారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి జిందాబాద్ లు కూడా అక్కడ వినిపించాయి. ఏది ఏమైనా పెద్ద కుటుంబాల్లో కొన్ని విషయాల్లో మనస్పర్థలున్నా అవసరంలో అందరూ ఒక్కటి కావడం అనేది ఆనవాయితీ. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే సంథ్య థియేటర్ దగ్గర మహిళా అభిమాని చనిపోవడం అందరినీ కలచివేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు పోలీసులు - అల్లు అర్జున్ కు అండగా వై.సి.పి.