ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా పుష్ప 2 సినిమాతో పలకరించారు. అంతేకాదు ఈ సినిమా అతి తక్కువ సమయంలో అంటే ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపుతోంది. బాలీవుడ్‌లోనూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాజకీయాల్లో రావాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేతో భేటీ అయినట్టు తెలుస్తోంది. పుష్ప సిరీస్ సినిమాలతో జాతీయస్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.
ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఇదే బాటలోనే అల్లు అర్జున్ కూడా వెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌ను కలిసినట్టు సమాచారం. ప్రజలకు దగ్గరయ్యేలా తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని అల్లు అర్జున్ నిర్ణయించినట్టు సమాచారం. రాజకీయాల్లోకి రావాలంటే ఉన్న సినిమా హీరో ఫేమ్ ఒకటే సరిపోదని అర్జున్‌తో పీకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వార్తలను అల్లు అర్జున్ టీమ్ కొట్టిపారేసింది. ఈ వార్తలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది అల్లు అర్జున్ టీమ్. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తల్లో నిజం లేదని.. అవన్నీ నిరాధారమైనవని అల్లు అర్జున్ టీమ్ వెల్లడించింది. ఇంకా మీడియా సంస్థలు ఇలాంటి వార్తలను ప్రచురించేటప్పడు.. ఒకటికి రెండు సార్లు క్లారిఫై చేసుకోవాలని.. అధికారిక ప్రకటనలు లేని వార్తలను ప్రచురించవద్దని అల్లు అర్జున్ టీమ్ వెల్లడించింది.