Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లు అర్జున్‌తో హీరో సిద్ధార్థ్‌కు సమస్యలా? 'పుష్ప-2'పై అలాంటి కామెంట్స్ ఎందుకు?

Siddharth

ఠాగూర్

, గురువారం, 12 డిశెంబరు 2024 (17:42 IST)
హీరో అల్లు అర్జున్‌ను ఉద్దేశించి కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా, బన్నీ ఫ్యాన్స్ సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టాయి. ముఖ్యంగా 'పుష్ప-2' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు భారీగా తరలివచ్చారు. దీనిపై సిద్ధార్థ్ కామెంట్స్ చేస్తూ ఇది మార్కెటింగ్‌ ట్రిక్స్ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌పై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ స్పందించారు. తాను నటించిన కొత్త చిత్రం మిస్ యూ ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు. తనకు ఎవరితోనూ సమస్యలు లేవు. 'పుష్ప?' మంచి విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పుష్ప సూపర్ సక్సెస్ అయింది కాబట్టి దాని సీక్వెల్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వెళ్తున్నారు.
 
ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఎంతమంది జనాలు వస్తే అంత మంచిది. థియేటర్లకు కూడా జనాలు రావాలని ఆశిద్దాం. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. మేమంతా (నటీనటులు) ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. 100 సినిమాలు విడుదలవుతుంటే ఒకటి హిట్ అవుతుంది. ఆర్టిస్టులందరికీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదానికి ముగింపుపలికినట్టయింది. 
 
కాగా, ఇటీవల సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉండగా.. డిసెంబర్ 13కు వాయిదా పడింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకృష్ణ దర్శకత్వంలో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వారధి రాబోతుంది