Police at geeta Arts Office
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పట్ల సానుభూతిపరులు ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. వై.సి.పి.కి చెందిన లక్మీపార్వతి, స్వతంత్ర పార్టీ అధినేత కె.ఎ.పాల్ లు ఓ వీడియోను విడుదల చేశారు. ఇరువురి సారాంశం ఒక్కటే కావడం విశేషం. వారుమమాట్లాడుతూ, తనకు సంబంధం లేని తొక్కిసలాటలో ఒకరు చనిపోతే నటుడు అల్లుఅర్జున్‌ను అరెస్టు చేశారు.
మరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 29, మంది కందుకూరు ఇరుకు సందులో బహిరంగ సభ పెట్టడం వలన జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు . వీరి మృతికి కారణమైన చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చెయ్యాలి? సెక్షన్ 19 ప్రకారం ఫ్రీడం ఆఫ్ స్పీచ్ నాకుందంటూ పాల్ తెలియజేస్తున్నారు.
ఇక ఇదిలా వుండగా, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్ట్ పై రకరకాలుగా వ్యాఖ్యానాలుగు జరుగుతున్నాయి. అన్నా.. నీ ఆర్మీ ఏమైంది? అంటూ వ్యంగాస్గ్రాలు సంధిస్తున్నారు. ఆయన ఆర్మీ ఫ్యాన్స్. ప్రతి సినిమా విజయానికికానీ, బర్త్ డే రోజున గానీ తమ సంస్థ కార్యాలయం గీతా ఆర్ట్స్ లో వేడుకలు జరుపుతుంటారు అల్లు అర్జున్. అందుకే అల్లు అర్జున్ కు చెందిన ఎ.ఎ.ఎ. థియేటర్ వద్ద, గీతా ఆర్ట్స్ ఆపీసు వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. ఎక్కడా గొడవలు జరగకుండా కంట్రోల్ చేసేందుకు సిటీలో పలుచోట్ల పోలీసులు ప్రత్యేకంగా వుండడం విశేషం.