Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

ఐవీఆర్
శనివారం, 14 జూన్ 2025 (12:55 IST)
తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య వ్యక్తిగత సహాయకుడు గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే ఇంటిపై వుండే పెంట్ హౌసులో ఎవరూ లేని సమయంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇతడి వయసు 38 ఏళ్లు. ఎమ్మెల్యే ఇంటిపైన పెంట్ హౌసులో తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివశిస్తున్న రవి ఇటీవలే తన సొంత ఊరు వెళ్లివచ్చాడు.
 
శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చిన రవి అదేరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో విషయమై ఎమ్మెల్యే సన్నిహితుడు రవిపై విరుచుపడినట్లు చెప్పుకుంటున్నారు. ఇది జరిగిన వెంటనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. బలవంతంగా ప్రాణాలు తీసుకునేంత భయంకరమైన కారణం ఏంటా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా రవి మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
 
రవి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రవి తల్లిదండ్రులు తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదనీ, తన కుమారుడు చావు వెనుక ఏదో బలమైన కారణం వుందని అంటున్నారు. దీనితో ఇప్పుడు ఆ బలమైన కారణం ఏంటా అని పలువురు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments