Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలివాన బీభత్సం.. తెలంగాణాలో 13 మంది మృత్యువాత

ఠాగూర్
సోమవారం, 27 మే 2024 (11:00 IST)
తెలంగాణ రాష్ట్రంలో గాలివానా బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం సృష్టించిన ఈ బీభత్సం ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు చనిపోయారు. షెడ్డు కూలిపోవడంతో తండ్రీ కూతుళ్లతో పాటు నలుగురు, పిడుగుపాటుకు ఇద్దరు, మరో ఆటో డ్రైవర్ చనిపోయారు. అలాగే, హైదరాబాద్ నగరంలో నలుగురు, మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా ఈ ఈదురు గాలులకు పలు జిల్లాలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులు, వర్షానికి నాగర్ కర్నూల్ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో గాలి దుమారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
 
హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెట్ల కొమ్ములు, హోర్డింగులు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  
 
మచిలీపట్నంలో వైకాపా నేతల అరాచకం : జనసేన నేత కారుకు నిప్పు!! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తమకు ఎదురు తిరిగే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వాహనాలకు నిప్పు అంటిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వీరిపై పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైకాపా నేతల అరాచకాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్‌ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్‌ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేశ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. 
 
'ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత నా కారును వైకాపా గూండాలు తగులబెట్టారు. జనసేన తరపున ప్రచారం చేస్తే నాపై వారికెందుకు అంత పగ? జగన్‌ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా? పవన్‌ కల్యాణ్‌ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు. గతంలోనూ అర్థరాత్రి మా ఇంటిపై దాడి చేశారు. మమ్మల్ని కొట్టి చంపాలని చూశారని కేసు పెట్టాం. ఒక్క రోజులో వారంతా బయటకి వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు నా కారును తగులబెట్టి రాక్షసానందం పొందుతున్నారు.
 
కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి. వంట గది అటువైపే ఉంది. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లం. వైకాపా వాళ్లను తిట్టలేదు.. వాళ్లతో గొడవకి వెళ్లలేదు. పవన్‌ కల్యాణ్‌పై అభిమానంతో జనసేనకు పనిచేస్తున్నా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేస్తారా? పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నాను' అని కర్రి మహేశ్‌ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments