Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి మేనిఫెస్టో ఇదిగో.. తెలంగాణ ఉద్యమకారులకు వేతనాలు...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (12:09 IST)
తెలంగాణ తెలుగుదేశం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణలో డిసెంబరు 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పార్టీ నాయకులు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.

* అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు
 
* రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ
 
* జిల్లాలు, జోనల్‌ వ్యవస్థలపై సమీక్ష
 
* 100 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌
 
* సాగునీటి కాంట్రాక్టుల్లో ఈపీఎస్‌ వ్యవస్థ రద్దు, స్థానిక కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం
 
* తొలి, మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం
 
* నిరుద్యోగులకు నెలసరి భృతి (రూ. 3 వేలు)కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం
 
* రూ. 10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
 
* రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి
 
* ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్‌ విధానం వర్తింపు
 
* పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
 
* ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం
 
* పెండింగ్‌లో ఉన్న మండల, డివిజన్‌ డిమాండ్ల పరిష్కారం
 
* అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత
 
* సంవత్సరంలోగా అమరవీరులకు స్మృతి వనం
 
* భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి, అర్హులందరికీ ఇచ్చేంత వరకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం
 
* బీసీ సబ్‌ప్లాన్‌
 
* మైనార్టీల సంక్షేమం కోసం సచార్, సుధీర్‌ కమిటీల నివేదికల అమలు
 
* సింగరేణి, ఆర్టీసీ రిటైర్డ్‌ కార్మికులకు ఆసరా పింఛన్లు
 
* దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ
 
* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
 
* అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్, వైద్య సౌకర్యం, గృహ వసతి, సంక్షేమం కోసం ప్రత్యేక నిధి
 
* 5 సంవత్సరాలలోపు ప్రాక్టీస్‌ ఉన్న లాయర్లకు స్టైఫండ్‌
 
* ఏటా ఉద్యోగ కేలండర్‌
 
* అన్ని జిల్లా కేంద్రాల్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు
 
* విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ఎన్నారై శాఖ
 
* విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర ప్రకటన
 
* ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్‌ ఏర్పాటు
 
* ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం... అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానం
 
* మండల కేంద్రాల్లో ఐటీఐ/జూనియర్‌ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్‌/డిగ్రీ కళాశాల, జిల్లాకో ఇంజనీరింగ్‌ కాలేజీ, పీజీ సెంటర్‌ ఏర్పాటు
 
* మహిళ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు
 
* పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు
 
* 104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా కార్పొరేషన్‌ ఏర్పాటు
 
* ఇంటి పన్ను హేతుబద్ధీకరణ
 
* తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, తగిన వేతనం
 
* తెలంగాణ సినీ రంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ
 
* ఖాయిలా పడిన పరిశ్రమల పరిరక్షణకు విధానం
 
* నిజాం షుగర్స్, సిర్పూర్‌ పేపర్‌ మిల్లు, సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments