Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ న‌ల్ల‌త్రాచు లాంటోడు : రేవంత్ రెడ్డి

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (13:06 IST)
కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాస్ పేటలో నిన్న నిర్వ‌హించిన రోడ్ షోలో కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలో అదే తేలిందని అన్నారు. రైతు ఎవ‌రూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లత్రాచు లాంటి వ్యక్తి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఓ ఉగ్రవాదిలా పోలీసులు తనను అరెస్ట్ చేశారని .. కొడంగల్ ప్రజలు 9 సంవత్సరాల క్రితం నాటిన మొక్క తానని వ్యాఖ్యానించారు. తనను కొడంగల్ ప్రజలు ఆశీర్వదించడంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు 100 అడుగుల గోతిలో పాతిపెట్టే రోజులు వచ్చాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

తర్వాతి కథనం
Show comments