Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస సర్కారు వల్లే హైదరాబాద్‌ గ్లోబల్ సిటీగా మారింది : కేటీఆర్

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (13:30 IST)
సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్లే హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారిందని తాజా మాజీ మంత్రి, సిరిసిల్ల తెరాస అభ్యర్థి కేటీఆర్ చెప్పుకొచ్చారు. శనివారం మాదాపూర్‌లో స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఐటీ కంపెనీల సీఈవోలు, బిజినెస్ హెడ్స్, ఐటీ ఉద్యోగులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన నగరం. తెరాస ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందన్నారు. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో తమ సేవలు విస్తరించాయని ఆయన గుర్తుచేశారు. 
 
దేశ జీడీపీలో ఎక్కువ శాతం మెట్రోపాలిటన్ నగరాలదే అని గుర్తుచేసిన కేటీఆర్... క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ ది బెస్ట్ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఏడాదిలోనే హైదరాబాద్ మెట్రోలో మూడు కోట్ల మందికిపైగా ప్రయాణించారు. హైదరాబాద్‌లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో లైన్ పొడిగిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments