Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఫ్రెండ్ చనిపోయాడు.. ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకాలె : కేటీఆర్ సారో ఇదేంటి : నాగ్ అశ్విన్

నా ఫ్రెండ్ చనిపోయాడు.. ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకాలె : కేటీఆర్ సారో ఇదేంటి : నాగ్ అశ్విన్
, బుధవారం, 28 నవంబరు 2018 (08:49 IST)
'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ఒక్క ట్వీట్ ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో వైరల్ అయింది. చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళితే ప్రాణాలతో బతికించుకోలేమా? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నిర్లక్ష్యానికి, చావుకి మారుపేరు కాకూడదు సార్ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. అసలు నాగ్ అశ్విన్ ఈ తరహా ట్వీట్ చేయడానికి కారణమేంటో తెలుసుకుందాం. 
 
నాగ్ అశ్విన్ స్నేహితుడు ఒకరు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆస్పత్రిలో ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేడు. అలా 3 గంటల పాటు చావుబతుకులతో పోరాడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఆ వార్డ్, ఈ వార్డ్ అంటూ అతన్ని చాలా సేపు స్ట్రెచర్‌పై అతని తల్లిదండ్రులు తిప్పారు. పైగా, చనిపోయిన వ్యక్తి గొప్ప కెమెరామెన్. కేవలం వైద్యులు అందుబాటులో లేనికారణంగా ఒక నిండుప్రాణం నిర్దాక్షిణ్యంగా బలైపోయిందంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ కేటీఆర్‌ని కూడా ట్యాగ్ చేశారు. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రికి కాకుండా మరో ఆస్పత్రికి తీసుకెళ్లివుంటే ఖచ్చితంగా అతను బతికేవాడు. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రికి మనిషిని తీసుకెళ్లి ఎందుకు బంతికించుకోలేం? ప్రభుత్వ ఆస్పత్రి అంటే నిర్లక్ష్యానికి, చావుకి మారుపేరు కాకూడదు సార్. దీని గురించి నేనెవర్ని ప్రశ్నించాలో అర్థంకావడం లేదు అని అశ్విన్ ట్వీట్ చేశాడు. 
 
కాగా, నాగ్ అశ్విన్ తల్లి  కూడా ఓ వైద్యురాలు. వీరికి సొంతగానే ఓ ఆస్పత్రి కూడా ఉంది. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరెరె... జాకీచాన్ కుమార్తె అలాంటి పనిచేసిందా?