కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక్కోసి హుండీలో వేసిన తూ.గో వాసి

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (11:30 IST)
ఎన్నికల్లో పోటీ చేసే తమ అభిమాన నేతలు విజయం సాధించాలని కార్యకర్తలు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. తాజాగా తెరాస అధినేత కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని తన నాలుక కోసి ఆలయ హుండీలో వేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరుగనుంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోనే తెరాస సింగిల్‌గా 119 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ సారథ్యంలో మరికొన్ని పార్టీలు కూటమిగా ఏర్పాటై పోటీ చేస్తున్నాయి. దీంతో పోటీ హోరాహోరీగా ఉంది. 
 
ఈనేపథ్యంలో హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో నివశించే తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తన నాలుకను కోసుకున్నాడు. 
 
ఈ నాలుకను బంజారాహిల్స్‌లోని ఓ ఆలయం హుండీలో కానుకగా వేశాడు. దీంతో ఆ యువకుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న వారు సమీపంలోని ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments