Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంతా ఆరుసార్లు గెలిచారు.. కిషన్ రెడ్డి ఓటమి

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (17:02 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు కారుకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా తెరాస విజయభేరీ మోగించింది. తెరాస చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటర్లు ఓటు వేశారు. ఫలితంగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పలుపలుచోట్ల అభ్యర్థలను భారీ మెజార్టీతో గెలుపొందిస్తే.. కొందరికి వరుస విజయాలను కట్టబెట్టారు. పలువురు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు.
 
వీరిలో హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌‌లు ఆరుసార్లు గెలిచినవారిలో ఉన్నారు. మంత్రి హరీశ్‌ రావు లక్షకుపైగా మెజారిటీతో విజయం సాధించడం విశేషం. అయితే, మరో నలుగురు మంత్రులు, సభాపతి, ప్రతిపక్ష నేత ఓటమిపాలయ్యారు. మంత్రులు తుమ్మల, జూపల్లి, మహేందర్‌ రెడ్డి, చందూలాల్‌ ఓటమిపాలవ్వగా.. సభాపతి మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ఓడిపోయారు. 
 
అదేవిధంగా అంబర్ పేట నుంచి పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఇకపోతే, కూకట్‌పల్లి స్థానం నుంచి పోటీ చేసిన నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని కూడా ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments