ఈ కేక్ చేయడం చాలా సింపుల్... మీ పిల్లలకు చేసి పెట్టండి..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (22:42 IST)
సాధారణంగా కేక్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. వీటికోసం బేకరీల చుట్టూ తిరిగి పిల్లలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కనుక మనం మన ఇంట్లోనే పిల్లలకు ఇష్టమైన కేక్స్‌ను తక్కువ ఖర్చుతో ఎంతో రుచిగా తయారుచేసి పెట్టవచ్చు. ముఖ్యంగా రవ్వతో చేసిన కేక్స్ ఎంతో రుచిని కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు రవ్వను ఉపయోగించి కేక్స్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
బొంబాయి రవ్వ- 2 కప్పులు
తినే సోడా-అర టీ స్పూన్
పచ్చికొబ్బరి తురుము-ఒక కప్పు
నెయ్యి-పావుకప్పు
పెరుగు- ఒక కప్పు
బాదం- పావు కప్పు
చక్కెర- 2 కప్పులు
పాలు- పావు కప్పు
నిమ్మరసం- ఒక టేబుల్ స్పూన్
 
తయారీ విధానం..
ఒక బాణలిలో బొంబాయి రవ్వ, తినే సోడా, కొబ్బరితురుము, పాలు, పెరుగు, నెయ్యి, ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక వెడల్పాటి పాత్రలో సమానంగా పోసి కుక్కర్లో అరగంటపాటు ఉడికించాలి. ఒక గ్లాసు నీళ్లు, నిమ్మరసం వేసి మిగిలిన చక్కెరను పాకం పెట్టాలి.
 
రవ్వకేక్ వేడిగా ఉండగానే పైన చక్కెర పాకం పోసి రెండు నిమిషాలు నాననివ్వాలి. తర్వాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని పైన బాదంతో అలంకరించుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suri: సూరి, సుహాస్ సెయిల్ బోట్ రేసింగ్ కథతో మండాడి చిత్రం

Vijay Sethupathi : పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించిన మూవీ జాకీ - టీజర్ విడుదల చేసిన విజయ్ సేతుపతి

Dance Festival: సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శనతో వైభవంగా భావ రస నాట్యోత్సవం - సీజన్ 1

ప్రభాస్‌తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments