నోరూరించే స్టఫ్‌డ్ గులాబ్‌జామ్.. తయారీ విధానం..?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (11:34 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - ఆరు
కోవా - 3 స్పూన్ల్
డ్రైఫ్రూట్స్ - 2 స్పూన్స్
చక్కెర - 1 స్పూన్
యాలకుల పొడి - పావు స్పూన్
నెయ్యి - వేయించడానికి సరిపడా
పాకం కోసం - చక్కెర
నీళ్లు - అరకప్పు
 
తయారీ విధానం:
ముందుగా చక్కెర పాకం చేసి పెట్టుకోవాలి. ఇందుకోసం ఓ గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. తీగపాకం వచ్చేవరకు ఉంచి ఆ తరువాత దింపేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులు అంచుల్ని తీసేసి ఒక్కోదానిపై కొద్దిగా నీళ్లు చల్లి అప్పడాల కర్రతో వత్తినట్లు చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోవా, డ్రైఫ్రూట్స్ పలుకులు, చక్కెర, యాలకుల పొడి తీసుకుని చెంచా నీళ్లు చల్లి పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని బ్రెడ్ ‌స్ట్లైసు మధ్యలో ఉంచి అంచుల్ని మూసేయాలి. ఆ తరువాత ఉండ వచ్చేలా చేత్తో గట్టిగా నొక్కినట్లు చేసుకోవాలి. అప్పుడే డ్రైఫ్రూట్స్ మిశ్రమం ఇవతలకు రాకుండా ఉంటుంది. ఇలా మిగిలిన స్లైసుల్నీ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి ఒక్కో ఉండను వేయించి తీసుకోవాలి. కొద్దిగా వేడి చల్లారాక చక్కెర పాకంలో వేసి 5 నిమిషాల తరువాత తీసేయాలి. అంతే నోరూరించే స్టఫ్‌డ్ గులాబ్‌జామ్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తరప్రదేశ్ ఇటావాలో వచ్చి పడిన క్షిపణి... వామ్మో, అది ఇరాన్ నుంచి వచ్చిందా? (video)

మహిళలను బలహీనులుగా చిత్రీకరించవద్దు.. పెద్ద కుర్చీని వద్దన్న నారా లోకేష్

ఐఎంటి హైదరాబాద్‌లో వేడుకగా జరిగిన 2026 బ్యాచ్ స్నాతకోత్సవం

యూపీలో ఘోరం.. థార్ బండి రివర్స్ గేర్ వేసిన మనవడు.. బామ్మ మృతి.. ఎలా? (video)

ఆడపిల్లలు పుట్టారని అసంతృప్తి.. కవల కుమార్తెలను కన్నతండ్రే కడతేర్చాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments